కాలే, బచ్చలికూర, కొల్లార్డ్ గ్రీన్స్ కంటి ఆరోగ్యానికి ఛాంపియన్లు ఇవి. ల్యూటిన్, జియాక్సంతిన్, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి దృష్టికి బాధ్యత వహిస్తాయి.
సాల్మాన్, ట్యూనా, మాకేరెల్, సార్డడినెస్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మంచిది.
బాదం, వాల్ నట్స్, పొద్దు తిరుగుడు గింజలు, అవిసె గింజలు, విటమిన్ ఇ ఇవి కంటి ఆరోగ్యంలో పని చేస్తాయి.
విటమిన్ సితో నిండిన ఆరెంజ్, ద్రాక్షపండ్లు, నిమ్మకాయలు మొత్తం కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి. కంటి శుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
గుడ్డులో లుటిన్ జియాక్సంతిన్, జింక్ ఉంటాయి. ఇవి ఆరోగ్యాకరమైన దృష్టిని అందిస్తాయి.
కాయధాన్యాలు, నల్ల బీన్స్, చిక్ పీస్ జింక్, మంచి పోషకాలున్న ఆహారాలు. ఇవి కంటి చూపుని పెంచుతాయి. రెటీనాను ఆరోగ్యంగా ఉంచడంలో పాత్ర పోషిస్తాయి.
రెడ్ బెల్ పెప్పర్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి కంటి ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
బటర్ నట్ స్క్వాష్, అకార్న్, బీటా కెరోటిన్, లుటిన్ లతో సహా యాంటీ ఆక్సిడెంట్ లతో నిండి ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి సహకరిస్తాయి.
బ్రోకలీ బ్రెస్సెల్స్ మొలకలు, ఈ క్రూసిఫరస్ కూరగాయలలో యాంటీ ఆక్సిడెట్లు, విటమిన్లు ఉన్నాయి. ఇవి కంటి వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.