జీవితంలో విజయం సాధించాలంటే జీవన నైపుణ్యాలు అవసరం. వీటిని పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పిస్తే వాళ్లు లైఫ్‌లో తప్పక విజయం సాధిస్తారు.
కొన్ని అలవాట్లతో పిల్లలకు క్రమశిక్షణ, ధృఢమైన వ్యక్తిత్వం అలవడేలా చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశగా కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు.
పిల్లలకు సొంతంగా వండుకుని తినడం, మంచి ఆహారపు అలవాట్లను నేర్పించాలట. పెద్దయ్యాక ఇవి వాళ్లకు ఎంతో ఉపయోగపడతాయట.
చిన్నతనంలోనే పిల్లలు సమయపాలన నేర్చుకుంటే పెద్దయ్యాక వారిలో క్రమశిక్షణ పెరుగుతుంది. దీంతో, ఉత్పాదకత మెరుగై లక్ష్యాలను ఈజీగా చేరుకోవచ్చు.
పిల్లలకు బాధ్యతాయుతమైన వైఖరిని నేర్పించడం అత్యంత ముఖ్యం. తమ దుస్తులను, పక్కను సర్దుకోవడం, గదిని నీట్‌గా ఉంచుకోవడం నేర్పిస్తూ క్రమశిక్షణ పెంచొచ్చు.
ఆర్థిక క్రమశిక్షణ అలవడాలంటే పిల్లలకు డబ్బు విలువ తెలియజెప్పాలి. అవసరాలు, దుబారా ఖర్చుల మధ్య తేడాను గుర్తెరిగి నడుచుకునేలా చేయాలి
ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు వంటి వాటిని పిల్లలతోనే చేయిస్తే వారికి గృహ నిర్వహణతో పాటూ పలు అదనపు నైపుణ్యాలు సమకూరుతాయట.
పిల్లలకు మొక్కల పెంపకంపై కూడా అవగాహన కల్పిస్తే వారు భవిష్యత్తులో పర్యావరణ రక్షణకు కట్టుబడి ఉంటారని కూడా నిపుణులు చెబుతున్నారు
అత్యవసర సమయాల్లో ఎలా నడుచుకోవాలో కూడా పిల్లలకు నేర్పించాలి. చిన్న చిన్న గాయాలకు కట్టుగట్టడం, ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్ వంటివి నేర్పించాలి
పిల్లలకు కుట్టుపనిపై కూడా అవగాహన కల్పిస్తే వారికి వస్తువుల పునర్వినియోగంపై ఇష్టత పెంచి, వృథాను అరికట్టొచ్చు
వివాదాల
ు తలెత్తినప్పుడు మానసిక పరిపక్వత, సానుకూల ధోరణితో వ్యవహరించేలా పిల్లలకు తర్ఫీదును ఇవ్వాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టిసారించాలి.
సమస్యలన
ు పరిష్కరించే నైపుణ్యాలు, సృజనాత్మకత పెరగాలంటే పిల్లలతో బొమ్మల తయారీ, కార్పెంటరీ, ఇంటి అలంకరణ వంటివి అలవాటు చేయాలి
Related Web Stories
ప్రపంచంలో అత్యంత భారీ పక్షులు ఇవే!
కాఫీ, టీ మానండి.. ఇలా చేసి ఉత్సాహంగా మారండి..!
శివరాత్రి పర్వదినం.. పులకించిన భక్తజనం
డబ్బులు ఎప్పుడు.. ఎలా వాడాలి..?