e73a6fda-f0aa-4d63-9a79-87ec37372da4-1.jpg

పంచమ వేదమైన మహాభారతం నుంచి విద్యార్థులు కచ్చితంగా నేర్చుకోవాల్సిన పది గుణపాఠాలు ఏంటంటే..

05cce97a-0647-481b-8cc4-842973006aa1-2.jpg

లక్ష్యంపైనే దృష్టిపెడితే అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చన్నది అర్జునుడిని చూసి నేర్చుకోవాల్సిన అంశం

0a053dda-b7ff-429d-a58f-fd9c1f89e42a-3.jpg

నిరంతర జ్ఞానసముపార్జనతో జీవితంలో విజయం సాధించొచ్చని మహాభారతం చెబుతోంది

f083c8aa-0cf7-4e06-9982-d4740e0dc791-4.jpg

కఠోర శ్రమతో ఎంతటి క్లిష్ట పరిస్థితుల నుంచైనా బయటపడొచ్చన్నది కర్ణుడు నేర్పిస్తున్న గుణపాఠం

ఎటువంటి ఆకర్షణలకు లోనుకాకుండా విద్యార్థులు తమ బాధ్యతలు నిర్వర్తించాలని పంచమవేదం ఉద్బోధిస్తోంది.

చెడుసావాసంతోనే దుర్యోధనుడు పతనమయ్యాడు. కాబట్టి, విద్యార్థులు స్నేహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

కలిసికట్టుగా ఉంటే ఎంతటి అపాయాన్నైనా దీటుగా ఎదుర్కోవచ్చన్నది పాండవుల నుంచి నేర్చుకోవాల్సి అంశం

ఉన్నతవ్యక్తిత్వానికి అసలైన నిదర్శనం ధర్మరాజు. కాబట్టి, విద్యా్ర్థులు తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి.

దృఢచిత్తంతో అజ్ఞాతవాసపు కష్టాల నుంచి పాండవులు గట్టెక్కారు. ఈ లక్షణాన్ని విద్యార్థులు ఒంటపట్టించుకోవాలి. 

విద్యార్థులు సహనం కోల్పోకుండా లక్ష్యం వైపు ప్రయాణించి విజయం అందుకోవాలని మహాభారతం బోధిస్తోంది.

భీష్ముడు, ద్రోణుడిలా విద్యార్థులు కూడా తమ మనసును ఎల్లప్పుడు చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. కట్టుతప్పనీకూడదు.