జంతువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలూ ఉన్నాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు

టీం వర్క్ ఎలా చేయాలో చీమల నుంచి నేర్చుకోవాలి

ఇతరుల పనిలో సహకరించడం, పని విభజన చీమల్లో స్పష్టంగా చూడొచ్చు

సాలీళ్లను చూసి పట్టుదల నేర్చుకోవాలి

సాలిగూళ్లను అల్లడంలో ఎన్ని సార్లు విఫలమైనా మళ్లీ ప్రయత్నించి అవి విజయం సాధిస్తాయి

చీతాలను చూసి సహనం అలవర్చుకోవాలి. 

వేటాడేటప్పుడు సరైన అవకాశాం వచ్చే వరకూ అవి ఓపిగ్గా ఎదురుచూస్తాయి

శునకాలను చూసి విశ్వాసంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి

గుడ్లగూబ నుంచి ఏకాగ్రత నేర్చుకోవాలి. వేటాడేటప్పుడు అది దాని దృష్టిని వేటపైనే నిలుపుతుంది

ఎలాంటి పరిస్థితుల్లోనైనా సులభంగా సర్దుకుపోవడాన్ని బాతును చూసి నేర్చుకోవాలి

తోడేళ్ల మందను చూసి నాయకత్వ లక్షణాలను నేర్చుకోవాలి