పిల్లలకు తల్లిదండ్రులే తొలి గురువులు. కాబట్టి, పసి మనసులపై ప్రభావం చూపే కొన్ని పనులను తల్లిదండ్రులు అస్సలు చేయకూడదు.
పిల్లల ముందు గొడవ పడకూడదు. దీని వల్ల వారిలో అభద్రతా భావం పెరుగుతుంది.
ఒకరినొకరు కించపరకూడదు. లేని పక్షంలో పిల్లలకూ ఈ దురలవాటు అలవడుతుంది.
తల్లిదండ్రులు నిత్యం కంప్యూటర్ల ముందు గడిపితే పిల్లలూ ఇలాగే వ్యవహరించే ప్రమాదం ఉంది.
భార్యాభర్తలు గొడవ పడ్డాక వేర్వేరు గదుల్లో నిద్రించడం కూడా పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది
పిల్లల్ని నిత్యం విమర్శిస్తూ ఉంటే వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది.
తల్లిదండ్రులు దుబారా ఖర్చులు చేస్తే పిల్లలు కూడా డబ్బు విలువ తెలుసుకోలేరు.
తల్లిదండ్రుల్లో ప్రతికూల భావాలు పిల్లలపై చెడు ప్రభావం చూపిస్తాయి. వారిలో ఆందోళన, అభద్రతను పెంచుతాయి.
పెద్దవాళ్ల సమస్యలను పిల్లలతో షేర్ చేసుకోవడం కూడా వారిలో ఒత్తిడి, ఆందోళన పెంచుతుంది.
తల్లిదండ్రుల్లో క్రమశిక్షణ లేకపోతే పిల్లలూ భవిష్యత్తులో కట్టుతప్పే అవకాశాలు ఎక్కువ.
పెద్దల నుంచి తాగుడు, దూమపానం వంటి అలవాట్లను పిల్లలూ నేర్చుకునే ప్రమాదం ఉంది.
Related Web Stories
శ్రీకృష్ణాష్టమి రోజున ఉల్లి కూడా తినొద్దు.. ఏం తినాలంటే..
విటమిన్-B12 డెఫిషియన్సీ ఎవరిలో కనబడుతుంది?
గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..
వావ్.. మఖానా తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?