ఆధునిక జీవితం ప్రతి ఒక్కరిలో అసహనాన్ని పెంచుతోంది. అయితే, క్షణికావేశాన్ని నిగ్రహించుకునేందుకు ఈ టిప్స్ పాటించాలి.

కోపం విపరీతంగా వచ్చినప్పుడు 1 నుంచి 100 వరకూ లెక్కించాలి. దీంతో, గుండె వేగం తగ్గి ఆవేశం చల్లారుతుంది

రోజూ ఎక్సర్‌సైజులు చేస్తే మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది.

కోపం వస్తోందనుకున్నప్పుడు చేతులు, కాళ్లను రిలాక్స్ అయ్యేలా స్ట్రెచ్ చేస్తే తక్షణ ఉపశమనం ఉంటుంది

మనసులో ఆవేశం చెలరేగుతున్నప్పుడు మంచి పాట వినడం కూడా సాంత్వన కలిగిస్తుంది

మనోభావాలకు అక్ష రూపం ఇవ్వడం కూడా భావావేశాలపై నియంత్రణ పెంచుతుంది

కోపాన్ని పెంచే పరిస్థితుల గురించి మనసుకు దగ్గరైన వారితో చర్చిస్తే ఉపశమనంతో పాటు పరిష్కారాలు లభించొచ్చు

మనకున్న దాంట్లో సంతృప్తిగా జీవించడం, కృతజ్ఞతాభావం కలిగుండటం కూడా ఆవేశకావేశాలపై అదుపునిస్తుంది.

కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం ద్వారా మనసులో సానుకూల వాతావరణం ఏర్పడి భావోద్వేగాలపై నియంత్రణ వస్తుంది.