పట్టణాలు, నగరాల్లోని కాలుష్యం కారణంగా చర్మానికి హాని కలుగుతుంది.

అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం ఆ నష్టం నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. 

బాదంలోని విటమిన్-ఈ చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. 

బచ్చలికూర, కాలేలోని యాంటీఆక్సిడెంట్లు.. ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంతో పాటూ చర్మంపై వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి. 

నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు చర్మం కాంతివంతంగా మార్చడంలో సాయపడతాయి. 

బ్రోకలీలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని విషపదార్థాల నుంచి రక్షిస్తాయి. 

కాలుష్యం వల్ల కలిగే చికాకు నుంచి చర్మాన్ని పసుపు రక్షిస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.