వీధి కుక్కలకు కొందరు మానవత్వం పేరిట ఆహారం పెడుతుంటారు. ఒక్కోసారి తెలీక ప్రమాదకరమైన ఆహారాన్నీ పెడుతుంటారు.
కొన్ని రకాల ఫుడ్స్ వల్ల కుక్కలు అనారోగ్యం పాలవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం..
చక్కెర అధికంగా ఉండే చాక్లెట్స్, కాండీలు లాంటివి అస్సలు పెట్టకూడదు
వీటిల్లో జైలిటాల్ అనే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది. ఇవి కుక్కల లివర్‌లు పాడయ్యేలా చేసి ప్రాణాంతకంగా మారతాయి.
కుక్కలకు పాల ఉత్పత్తులు కూడా పెట్టకూడదు
పాల ఉత్పత్తుల్లోని లాక్టోస్ కుక్కలకు అస్సలు పడదు. దీని వల్ల వాంతులు, డయేరియా తలెత్తుతాయి
అల్లం, వెల్లుల్లి ఉన్న ఆహార పదార్థాలు కూడా శునకాలకు పెట్టకూడదు.
వీటిల్లో ఉండే థయోసల్ఫేట్ రసాయం కారణంగా కుక్కల్లో ఎర్ర రక్త కణాలు దెబ్బతిని రక్త హీనత బారిన పడతాయి
కుక్కలకు చాక్లెట్లు కూడా పెట్టకూడదు. వీటిల్లోని థియోబ్రోమిన్ కుక్కలకు చాలా చేటు చేస్తుంది.
సరిగ్గా ఉడకని బంగాళదుంపల్లో సొలానిన్ ఉంటుంది. ఇది డయేరియా, వాంతులు, కన్‌ఫ్యూజన్ వంటి సమస్యలు కలుగజేస్తుంది.
Related Web Stories
ల్యాప్ టాప్, కంప్యూటర్ ఉపయోగిస్తున్నవారిలో ఈ లక్షణాలుంటే జాగ్రత్త..!
ఏకాగ్రత పెంచే ఈ 5 చిట్కాలతో అద్భుతమైన రిజల్ట్స్!
IDIOT సిండ్రోమ్ అంటే ఏమిటి? దీనిని ఎలా గుర్తించాలి.
యవ్వనంగా ఉండటానికి ఆయుర్వేదం చెప్పిన రహస్య చిట్కాలు..!