మెదడు మెరుపు వేగంతో పనిచేస్తేనే జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం.

మైండ్ షార్ప్‌గా ఉండాలంటే ఉదయాన్నే కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలని నిపుణులు చెబుతున్నారు.

ఉదయాన్నే గోరువెచ్చని లేదా సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీరు తాగాలి.

దీని వల్ల మెదడు ఉత్తేజితం అవుతుంది. జీర్ణవ్యవస్థ కూడా మెరుగవుతుంది.

ఉదయాన్నే బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు లేదా మెడిటేషన్ తప్పనిసరిగా చేయాలి.

మెడిటేషన్‌తో స్థిరచిత్తం వచ్చి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఇనుమడిస్తాయి

మెదడు ఆరోగ్యం కోసం ఉదయాన్నే పోషకాలు మెండుగా ఉన్న అల్పాహారం తీసుకోవాలి.

ఆయా కాలాల్లో లభించే పళ్లతో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్, యాంటిఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉన్న ఫుడ్ తినాలి

ఉదయాన్నే యోగా లేదా వాకింగ్‌ చేయడం ద్వారా మెదడు ఉత్తేజితమవుతుంది.

ఆ రోజు చేయాల్సిన పనులను ఉదయాన్నే సమీక్షించుకుంటే ఆందోళన తగ్గి మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది.