‘హెలికోబ్యాక్టర్ పైలోరీ(హెచ్ పైలోరీ)’ బ్యాక్టీరియా కేసులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని
ప్రొఫెసర్ డాక్టర్ బ్యారీ మార్షల్ ఆందోళన వ్యక్తం చేశారు
డాక్టర్ బ్యారీ మార్షల్ నోబెల్ బహుమతి గ్రహీత, ఆస్ట్రేలియా వెస్ట్రన్ యూనివర్సిటీ మైక్రోబయాలజీ ప్రొఫెసర్
భారత్‌లో 50-60% జనాభాలో ఈ బ్యాక్టీరియా బాధితులున్నారని ఆయన అంచనా వేశారు
జీర్ణాశయం, పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు పొట్ట క్యాన్సర్లకూ ‘హెచ్ పైలోరీ’ బ్యాక్టీరియా కారణం
గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో
‘హెచ్ పైలోరీ’ బ్యాక్టీరియాపై పరిశోధనల కోసం తొలిసారిగా ప్రత్యేక కేంద్రాన్ని నెలకొల్పారు
ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డితో కలిసి బ్యారీ మార్షల్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు
అపరిశుభ్రత, కలుషిత తాగునీరు తదితర కారణాలతో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది
ఇంట్లో ఒకరికి సోకితే..మిగతా వారూ దీని బారినపడే ముప్పు ఉంది
కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బారినపడిన చరిత్ర ఉంటే.. మిగతా సభ్యులు వెంటనే
ఈ బ్యాక్టీరియా పరీక్షలు చేసుకోవాలి అని సూచించారు
Related Web Stories
పాములను తినడానికి ఇష్టపడే పక్షులు ఇవే..
దునియాలోనే అత్యంత ఖరీదైన కండోమ్.. ధర ఎంతంటే..
శరీరంలో ఒత్తిడికారక కార్టిసాల్ హార్మోన్ను తగ్గించే ఫుడ్స్!
మహిళలు నైటీలు ధరిస్తే ఎంత ప్రమాదమో తెలుసా..