జంతువులు వాతావరణ మార్పులను  ముందుగానే పసిగడతాయని కొందరు చెబుతుంటారు. అవేంటో ఓసారి చూద్దామా..

కప్పలు బిగ్గరగా అరుస్తున్నాయంటే పెద్ద గాలీవానా రాబోతోందని అర్థమట

పక్షులు చాలా ఎత్తున ఎగురుతున్నాయంటే వాతావరణం ప్రశాంతంగా ఉందని, తక్కువ ఎత్తులో ఎగిరితే వాన పడొచ్చని అర్థమట.

వాతావరణం మారే ముందు ఆవులు కూడా కంగారుకు లోనవుతాయని కొందరు చెబుతారు

పువ్వుల సమీపంలో సీతాకోకచిలుకలు, తేనెటీగలు లేకపోతే వాతావరణంలో మార్పు రాబోతున్నట్టే

భారీ వానపడే ముందు గొర్రెలు అన్నీ ఒక చోట అసాధారణ రీతిలో గుమిగూడతాయట

లేడీ బగ్ పురుగులు బాగా ఎగురుతుంటే వాతావరణం పొడిగా ఉంటుందని అర్థం

ఉడత జాతికి చెందిన గ్రౌండ్‌హాగ్ అనే జంతువు కూడా వాతావరణ మార్పులను ముందుగానే పసిగడుతుందట