సుదర్శన్ సేతు గురించి  7 కీలక విషయాలు

సుదర్శన్ సేతు.. ఇది దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్-స్టేడ్ బ్రిడ్జ్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వంతెనను ఆదివారం ప్రారంభించారు.

ఈ వంతెన ‘ఇంజనీరింగ్ మార్వెల్’గా పరిగణించబడుతోంది. ఈ నాలుగు లేన్ల కేబుల్ బ్రిడ్జ్‌ని గుజరాత్‌లోని అరేబియా సముద్రంపై నిర్మించారు.

ఈ కేబుల్-స్టేడ్ వంతెన బేట్ ద్వారకా ద్వీపాన్ని.. గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో ఓఖా ప్రధాన భూభాగానికి కలుపుతుంది.

ఈ వంతెన మొత్తం పొడవు 4.7 కిలోమీటర్లు. ఇందులో వంతెన 2.32 కి.మీ., రహదారి 2.45 కిలోమీటర్లు, కేబుల్-స్టేడ్ విభాగం 900 మీటర్లు.

ఈ వంతెనకు ఇరువైపులా 2.50 మీటర్ల వెడల్పుతో ఉన్న ఫుట్‌పాత్‌లు.. భగవద్గీతలోని శ్లోకాలు, చిత్రాలతో అలంకరించబడి ఉన్నాయి.

రూ.978 కోట్లతో దీనిని నిర్మించారు. గతంలో ‘సిగ్నేచర్ బ్రిడ్జ్’గా పిలిచే ఈ వంతెనకు ‘సుదర్శన్ సేతు’గా పేరు మార్చారు.

ఇంతకుముందు ద్వారకాధీష్ ఆలయాన్ని పగటిపూటే సందర్శించడానికి వీలుండేది. ఇప్పుడు ఈ సేతు వల్ల అన్ని సమయాల్లోనూ సందర్శించొచ్చు.