డబ్బును ఎప్పుడూ దాచకూడదు. సరైన స్థలంలో పెట్టుబడి పెట్టాలి.
అన్యాయాన్ని అనుసరించే వ్యక్తి వెంట డబ్బు ఉండదు. అలాంటి వారితో ఎప్పుడూ డబ్బు సమస్యలే.
దానం చేయడం మంచి విషయమే.. కానీ అతిగా దానం చేయకూడదు. ఆదాయం దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి.
ఖర్చులు అదుపు చేసుకోవాలి.. లేనిచో పొదుపు ఉండదు. ఖర్చులు, పొదులపై నియంత్రణ ఉంటే డబ్బు మీ వెంటే ఉంటుంది.
డబ్బును చూసి ఎప్పుడూ గర్వపడకూడదు. డబ్బుపై అహం కాదు.. గౌరవం ఉండాలంటున్న చాణక్యుడు.
డబ్బుతో మీ లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోండి.. కావాల్సిన వాటికోసం ప్రణాళికను రూపొందించుకోవాలి. మీ పనులు ఇతరులకు హాని కలిగించకూడదు.
డబ్బు విలువ తెలుసుకోవడానికి.. మీతో ఉండే వ్యక్తులూ ముఖ్యమే. మీ విలువ, ప్రేరేపించే.. ప్రోత్సహించే వ్యక్తులతో స్నేహం చేయండి. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండాలి.