సన్ డ్యామేజ్ నుండి జుట్టును కాపాడేందుకు 7 చిట్కాలు ఇవి..

పెరిగిన వాతావరణ ఉష్ణోగ్రతల కారణంగా ఎండలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. 

 ఈ ఎండల్ని తట్టుకోవాలంటే తీసుకునే జాగ్రత్తల్లో వెంట్రుకల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి.

UV హానికరమైన ఈ కిరణాలను నిరోధించడానికి UV రక్షణను ఇచ్చే స్ప్రే లేదా లీవ్ ఇన్ కండీషనర్ పూస్తూ ఉండాలి.

పీక్ సన్ అవర్స్ సమయంలో UV కిరణాలు బలంగా ఉన్నప్పుడు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకూ ఎండ నుంచి దూరంగా ఉంటే సరి. 

డీప్ కండీషన్ వారానికి ఒకసారి చేస్తే ఇది జుట్టును తేమగా ఉంచుతుంది.

సముద్రం, చెరువులలో ఈత కొట్టిన తర్వాత మంచి నీటితో జుట్టును శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

హీట్ స్టెలింగ్ టూల్స్ వాడకాన్ని తగ్గించాలి. ఇది జుట్టును డ్యామేజ్ చేస్తుంది.

జుట్టును లోపలి నుంచి హైడ్రేటెట్ గా ఉంచడానికి పుష్కలంగా నీరు తాగాలి. ఇది వెంట్రుకలు పొడిగా ఉండటాన్ని తగ్గిస్తుంది.

ఈ అలవాట్లు ఎండలో జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.