లైఫ్‌లో విజయం సాధించాలంటే అందుకు అనుగూణంగా మెదడుకు శిక్షణ ఇవ్వాలి. ఇందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.
నిర్దేశించుకున్న లక్ష్యాలను చిన్న చిన్న పనులుగా విడగొట్టి సమయం తప్పకుండా పూర్తి చేయాలి.
సవాళ్లను అభివృద్ధికి అవకాశాలుగా భావించాలి. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి.
పనులు క్రమం తప్పకుండా పూర్తి చేసేలా ఓ షెడ్యూల్ సిద్ధం చేసుకుని దాన్ని తూచా తప్పకుండా పాటించాలి.
రోజులో మీకంటూ కొంత సమయం కేటాయించుకోవాలి. ఆ టైంలో ఏకాంతంగా కూర్చుని రోజ గడిచిన తీరును సమీక్షించాలి.
కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. దీంతో, మెదడు నిరంతరం చురుగ్గా ఉంటుంది.
క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులు చేయడం కూడా మెదడు ఆరోగ్యానికి కీలకమని నిపుణులు చెబుతున్నారు.
తగినంత నిద్ర పోవడం కూడా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సమస్యలను వేగంగా పరిష్కరించే శక్తిని ఇస్తుంది.
స్నేహితులు, బంధువులు, సహోద్యోగులతో మంచి సంబంధ బాంధవ్యాలు నెరపడం కూడా మానసిక ఆరోగ్యానికి అవసరం
Related Web Stories
భారతదేశంలో లభించే అత్యంత ఖరీదైన ఆహారాలు ఇవే..
మార్నింగ్ లెమన్ వాటర్ అందరూ తాగొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ తగ్గాలంటే ఈ ఫుడ్స్ తినండి..!
70వ నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ వీరే..