చీమలు చూడటానికి చిన్నగానే ఉన్నా వాటి వేగం సామర్థ్యం అసామాన్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

ఈ భూమ్మీద మొత్తం 12 వేల చీమల జాతులు ఉన్నాయి

ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇమిడిపోగలిగే చీమలు అంటార్కిటికా మినహా అన్ని చోట్లా కనిపిస్తాయి

కొన్ని జాతుల్లో రాణి చీమ ఏకంగా 30 ఏళ్ల పాటు జీవిస్తుందట. కీటక ప్రపంచంలో ఇదే టాప్ రికార్డ్!

బుల్లెట్ యాంట్ అనే చీమ కుడితే కలిగే నొప్పి అత్యధికమట. అందుకే దీనికి బుల్లెట్ పేరు పెట్టారట.

ఫైర్ యాంట్స్ అనే చీమల కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ డాలర్ల నష్టం జరుగుతోంది.

ట్రాప్ జా చీమ తన దవడలను గంటకు 140 మైళ్ల వేగంతో కదల్చగలదు. దీన్నుంచి తప్పించుకోవడం అసాధ్యం.

తమ కంటే 50 రేట్లు బరువైన వస్తువులను చీమలు ఎత్తగలవట

చీమల్లో పని విభజన ఉంటుంది. రాణి చీమతో పాటు గూడును కాపాడే సైనిక చీమలు, రోజువారి పనులు చేసే కార్మిక చీమలు ఉంటాయి.