ఉడకబెట్టినప్పుడు మరింత పోషకమైన 8 సూపర్ ఫుడ్స్ ఇవే..
గుడ్లుగుడ్లను పచ్చిగా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఉడికించి కూడా తీసుకుంటారు. వీటిని ఉడికించడం వల్ల అందులోని ప్రోటీన్లు మరింత ఆరోగ్యంగా మారే అవకాశం ఉంటుంది.
క్యారెట్లు.. క్యారెట్లను పచ్చిగానూ, ఉడికించి కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల విటమిన్ ఎ, బీటా కెరోటిన్, విటమిన్ ఎ గా మార్చే యాంటీఆక్సిడెంట్స్, శరీరం మరింత తీసుకుంటుంది.
దుంపలు.. ఉడకబెట్టిన దుంపలు వాటి ఫోలేట్ కంటెంట్ కారణంగా కణాల పెరుగుదలకు మంచిది. ఇందులోని విటమిన్ బి ఆరోగ్యాన్నిస్తుంది.
బ్రోకలీ..
ఉడకబెట్టిన బ్రోకలీలో సల్పోరాఫేన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.
బచ్చలి కూర..
బచ్చలి కూర ఉడకబెట్టడం వల్ల ఫోలేట్, ఇనుము లభిస్తాయి. ఇవి విటమిన్ సి నష్టాన్ని తగ్గిస్తుంది. సులువుగా ఉడికి మంచి రుచి కలిగి ఉంటుంది.
బంగాళ దుంపలు.. ఇవి ఉడికించి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులో ఖనిజాలు, పోటాషియం ఎక్కువగా ఉంటుంది.
చిలకడ దుంపలు.. బంగాళా దుంపల మాదిరిగానే ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే విటమిన్ ఎ కూడా లభిస్తుంది.
చిక్పీస్, కాయధాన్యాలు.. ఈ చిక్కుళ్లు ఉడికించి తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణం అవుతాయి. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.