ఏపీలోని 9 అందమైన హిడెన్ టూరిస్ట్ స్పాట్స్
హార్స్‌లీ హిల్స్: ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది. చుట్టుపక్కల ఉండే కొండ ప్రాంతాలు చూడమచ్చటగా కనిపిస్తాయి.
తలకోన జలపాతం: ఇది ఏపీలో అత్యంత ఎత్తైన జలపాతం. 270 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు దూకుతుంటాయి.
మారెడుమిల్లి: తూర్పు గోదావరిలో ఉండే ఈ ప్రాంతం.. దట్టమైన అడవులు, సహజమైన నదులు, విభిన్న వన్యప్రాణాలకు ప్రసిద్ధి.
గండికోట: పెన్నా నది ద్వారా ఈ అందమైన కొండగట్టు ప్రాంతం ఏర్పడింది. చుట్టుపక్కల ప్రాంతం కనులవిందుగా ఉంటుంది.
నాగార్జున కొండ: ఇదొక పురావస్తు ప్రదేశం. ఇక్కడ మూడో శతాబ్దానికి చెందిన శిథిలాలు, ఇతర ఆనవాళ్లు ఉన్నాయి.
ఎత్తిపోతల జలపాతం: 70 అడుగుల ఎత్తులో ఉండే ఈ జలపాతం.. చూడ్డానికి ఎంతో అద్భుతంగా, మనోహరంగా ఉంటుంది.
అహోబిలం: విష్ణువు అవతారమైన నరసింహ స్వామికి చెందిన ప్రాచీన ఆలయాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.
పాపికొండలు: ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణం కారణంగా.. ఇది ఆంధ్రా కాశ్మీర్‌గా ప్రసిద్ధి చెందింది.
బెలూమ్ గుహలు: నంద్యాల జిల్లాలో ఉండే ఈ గుహలు.. భారత ఉపఖండంలో రెండో అతిపెద్దగా గుహలుగా పేరుగాంచాయి.
Related Web Stories
ఈ వేసవిలో ఉసిరి జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఏలకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
సోయా మిల్క్.. ఏడు ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ముఖం శాశ్వతంగా మెరుస్తూ ఉంటుంది..!