అబుదాబీని పరిపాలించే అల్‌ నహ్యాన్ రాజకుటుంబం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనదట

యూఏఈ అధ్యక్షుడు షేక్ ముహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ కుటుంబపెద్దగా వ్యవహరిస్తారు.

ఈయనకు 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు ఉన్నారు. 9 మంది సంతానం. 18 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు.

రూ.4708 కోట్ల ప్రెసిడెన్షియల్ పాలెస్, 8 ప్రైవేట్ జెట్లు ఈ కుటుంబం ఆధీనంలో ఉన్నాయి

ప్రపంచంలోని 6 శాతం చమురు నిల్వలు ఈ కుటుంబం సొంతం. అనేక ప్రపంచస్థాయి కంపెనీల్లో వీళ్లకు వాటాలు ఉన్నాయి

అబుదాబీలోని ఖసర్ అల్‌వతన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ వీరికి చెందినదే.

అబుదాబీ పాలకుడి సోదరుడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ వద్ద ప్రపంచపు అతిపెద్ద ఎస్‌యూవీ ఉంది

మరో సోదరుడు తన్హౌన్ బిన్ జయేద్ అల్ నహ్యాన్..రాజకుటుంబానికి చెందిన ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీకి నేతృత్వం వహిస్తారు.

ఒకానొక నివేదిక ప్రకారం, అల్ నహ్యాన్ కుటుంబ సంపద బ్రిటన్ రాజవంశ సంపదతో సమానమట.