చర్మ నిగారింపుకు ముల్తానీ మిట్టి ఒక్కటి చాలు..!

ఇది జిడ్డు చర్మానికి మంచి చికిత్స. చర్మ రంధ్రాలను అన్ లాగ్ చేస్తుంది. మొటిమలు, పగుళ్లు రాకుండా చేస్తుంది.

చర్మంపై ముల్తానీ మిట్టిని ఉపయోగించడం వల్ల ఆరు రకాల ప్రయోజనాలు మన చర్మానికి అందుతాయి.

సున్నితమైన చికిత్స ఇది. ముల్తానీ మిట్టి ముఖంపై ఉన్న మురికి, ధూళి, ఇతర మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఎక్స్‌ఫోలియేట్స్ చేయడం వల్ల చర్మం నుంచి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ సహా మృత చర్మ కణాలను తొలగిస్తుంది.

చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ముల్తానీ మిట్టిలో యాంటీ టానింగ్ గుణాలుంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి.

మూసుకున్న చర్మ రంధ్రాలను తెరుస్తుంది. ఈ రంధ్రాల నుంచి మురికి, మలినాలను గ్రహిస్తుంది.

చర్మం మెరిసేలా చేస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

మొటిమలతో పోరాడుతుంది. చర్మ గ్రంథులలో తేమను నిలుపుతుంది.