పచ్చిపాలు ముఖానికి రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే..!

పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పచ్చిపాలు ముఖానికి రాస్తే అద్భుతమైన సౌందర్య ప్రయోజనాలు ఉంటాయి.

పచ్చిపాలను ముఖానికి రాసుకుంటే  ముఖ చర్మం మీది మలినాలు,  మురికిని సహజంగా తొలగిస్తుంది.  

పచ్చిపాలు చర్మానికి సహజ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది.   చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా ఉంచుతుంది.

పచ్చిపాలు చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ప్రకాశవంతంగా మారుస్తుంది.

తీవ్రమైన ఎండ వల్ల ఏర్పడే సన్ ట్యాన్ తొలగించడంలో పచ్చిపాలు బాగా పనిచేస్తాయి.  ఇది చర్మానికి ఓదార్పు ఇస్తుంది.

పచ్చిపాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది.

పచ్చిపాలలో ఉండే పోషకాలు చర్మం మీద ముడతలు, గీతల ను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మాన్ని యవ్వనంగా మారుస్తాయి.

చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడంలో పచ్చిపాలు సహాయపడతాయి.  చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో, చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.