అరచేతులను రుద్దితే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసా..?

ఉదయం లేవగానే అరచేతులను రుద్ది దాన్నుండి పుట్టే వేడిని ముఖానికి రాసుకోవడం చాలామంది అలవాటు.

మానసికంగా అలసిపోయినప్పుడు,   ఏకాగ్రత లేనప్పుడు అరచేతులను గట్టిగా రుద్దితే తిరిగి చురుగ్గా మారతారు.

అరచేతులను గట్టిగా రుద్ది ఆ వేడిని ముఖానికి రాసుకుంటే నాడీ వ్యవస్థకు ఓదార్పు లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది.

అరచేతులను రుద్దినప్పుడు విడుదలయ్యే వేడి హృదయ చక్రాన్ని  ప్రభావితం చేస్తుంది. ఇది భావోద్వేగాలను నియంత్రించి ప్రశాంతతను ఇస్తుంది.

చైనీస్ వైద్యంలో అరచేతులను రుద్దడం అనేది సాంప్రదాయ వైద్యంలో భాగంగా ఉంది. ఇది శరీరంలో ఇంద్రియాలను మేల్కొలుపుతుందట.

అరచేతులను రుద్దడం వల్ల చలికాలంలో చేతులలో రక్తప్రసరణ పెరిగి  చలి నుండి ఉపశమనం లభిస్తుంది.

నిద్రపోవడానికి ముందు అరచేతులను రుద్ది  ఆ వెచ్చదనాన్ని కళ్ల మీద ఉంచితే హాయిగా నిద్ర వస్తుంది.  అలసిపోయిన కళ్లకు మంచి విశ్రాంతి లభిస్తుంది.