విటమిన్-ఇ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఆక్సీకరణ నష్టం తగ్గించడంలోనూ, రోగనిరోధక శక్తి పెంచడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ, కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలోనూ విటమిన్-ఇ కీలకంగా పనిచేస్తుంది.
అవకాడో..
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటూ విటమిన్-ఇ సమృద్దిగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్దాప్యాన్ని తగ్గించి చర్మం యవ్వనంగా ఉంచేలా చేస్తాయి.
వీట్ జెర్మ్ ఆయిల్..
ఈ నూనెలో విటమిన్-ఇ అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వాపులను తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
ప్రొద్దుతిరుగుడు విత్తనాలు..
పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. గుండె ఆరోగ్యానికి మంచివి.
బాదం..
బాదం పప్పులు విటమిన్-ఇ ప్రధాన మూలం. చర్మ ఆరోగ్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి
హాజెల్ నట్స్..
హాజెల్ నట్స్ లో విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు చాలా మంచివి.
రెడ్ బెల్ పెప్పర్..
రెడ్ బెల్ పెప్పర్ లో ఐరన్, విటమిన్-ఇ, విటమిన్-సి ఉంటాయి. మోకాళ్ల నొప్పులు తగ్గించడంలో, చర్మ ఆరోగ్యాన్నిమెరుగుపరచడంలో సహాయపడతాయి.
వేరుశనగలు, వేరుశనగ వెన్న..
వేరుశనగలు, పీనట్ బట్టర్ లో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది.ఇది కణాల ఆరోగ్యానికి, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడంలో , హృదయనాళ పనితీరు మెరుగుపరచడంలో సహాయపడతాయి.
పాలకూర..పాలకూరలో విటమిన్-ఇ, ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.