చలికాలంలో కాళ్ల పగుళ్ళకు అద్భుతమైన చిట్కాలు..
చలికాలంలో పొడిగాలుల కారణంగా మడమల పగుళ్లు వస్తాయి. ఇంటి చిట్కాలతో వాటిని ఈజీగా తగ్గించవచ్చు.
వాసెలిన్ లో కాసింత నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి పాదాలకు అప్లై చేస్తే అద్భుత ఫలితాలుంటాయి.
అరటిపండు తేనె పేస్ట్ అప్లై చెయ్యాలి. పగిలిన మడమలను తొందరగా రిపేర్ చేస్తుందిది.
కొబ్బరినూనెలో రాతి ఉప్పు కలిపి కాలి మడమలకు స్ర్కబ్ చేసుకోవాలి. మడమల పగుళ్ళు పోయి చర్మానికి పోషణ లభిస్తుంది.
విక్స్ వాపోరబ్ పగిలిన మడమలకు మ్యాజిక్ చేస్తుంది. దీన్ని అప్లై చేస్తే లేత పాదాలు మీ సొంతం.
పెరుగులో వెనిగర్ కలిపి పాదాలకు రాస్తే పగుళ్లు తగ్గుతాయి. మడమలు మృదువుగా మారతాయి.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి పాదాలను నానబెట్టి పెడిక్యూర్ చేసుకోవాలి. దీనివల్ల పగుళ్ళు తొందరగా తగ్గిపోతాయి.