పూజ కోసం వాడిన పువ్వులను ఇలా ఉపయోగిస్తారని మీకు తెలుసా..
పూజలు, ఫంక్షన్లలో ఉపయోగించిన పువ్వులను చెత్త బుట్టలో వేయడం సాధారణం. కానీ చాలామందికి పువ్వులను అలా పడేయడం నచ్చదు.
వాడిన పువ్వులను పడేయకుండా కంపోస్టింగ్ లో ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే మొక్కలు బాగా ఎదుగుతాయి.
వాడిన పువ్వులతో ధూపం కోన్ లు కూడా తయారు చేయవచ్చు. పువ్వుల రేకలను ఎండబెట్టి మిక్సీ వేసి ఇందులో కర్పూరం, జవ్వాది వంటివి జోడిస్తే ధూపం కోన్ లు రెఢీ.
పువ్వుల రంగులను డై కలర్స్ గా ఉపయోగించవచ్చు. గులాబీ, బంతి, మందారం వంటి ముదురు రంగు పువ్వులతో పౌడర్ లేదా ద్రావణం తయారుచేసి ఉపయోగించవచ్చు.
వాడిన పువ్వుల రెక్కలు సేకరించి వాటిని శుభ్రం చేసి నీటిలో వేసి సగానికి మరిగించాలి. ఈ నీటిని చర్మానికి ఉపయోగించాలి. గులాబీలతో మాత్రమే కాకుండా ఇతర పువ్వులతో కూడా తయారుచేసుకోవచ్చు.
గులాబీ, మల్లె, దేవగన్నేరు, పారిజాతం వంటి సువాన కలిగిన పూలను ఎండబెట్టి వాటికి ఎస్సెన్షియల్ ఆయిల్ జోడించి అగరబత్తులు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
ఎండిన పువ్వులను ఉపయోగించి ఇంట్లో సోప్స్ కూడా తయారు చేసుకోవచ్చు. పూల రేకులు జోడించి చేసిన సోప్ లు మంచి స్ర్కబ్ లు గా పనిచేస్తాయి.
సబ్బుల మాదిరిగానే పూలను ఉపయోగించి కొవ్వొత్తులు కూడా తయారుచేసుకోవచ్చు. ఇల్లంతా మంచి సువాసన ఇస్తాయి.