కళ్లు మూసున్నా  ఈ జీవులు అన్నీ చూడగలవు! 

చీకటి ప్రదేశాలకు అలవాటు పడ్డ బ్లైండ్ కేవ్ ఫిష్ చేపలకు కళ్లే ఉండవు. కానీ పరిసరాలపై వీటికి పూర్తి అవగాహన ఉంటుంది.

పాములకు పారదర్శకమైన కను రెప్పలు ఉంటాయి. దీంతో, అవి తేలిగ్గా చూడగలుగుతాయి.

 ఊసరవెల్లుల్లో ఒక్కో కంటికీ రెండు కనురెప్పలు ఉంటాయి. వాటికి చిన్న కన్నం కూడా ఉండటంతో అవి రెప్పలు మూసున్నా చూడగలుగుతాయి.

బాక్స్ టర్టల్స్ అనే తాబేళ్లకున్న ప్రత్యేకమైన కనురెప్పల కారణంగా అవి కళ్లుమూసుకుని కూడా కొన్ని ఆకారాలను చూడగలవు.

అలుగులు (పాంగోలిన్) కూడా ప్రత్యేకమైన కనురెప్పల కారణంగా వెలుతురు, ఇతర ప్రాణుల కదలికలను మూసి ఉన్న కళ్లతో గుర్తించగలవు.

చూడటానికి అలుగులా కనిపించే ఆర్మడిల్లోలు పారదర్శకమైన కనురెప్పల కారణంగా కళ్లుమూసుకుని కూడా చూడగలవు.

పాసమ్స్‌కు మూడో కనురెప్ప ఉంటుంది. ఇది కాస్తంత పారదర్శకంగా ఉండటంతో ఇది కళ్లుమూసుకుని కూడా చూడగలదు. 

డాల్ఫిన్లు కళ్లతో పనిలేకుండా కేవలం శబ్దం ఆధారంగా తమ చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోగలవు. ఈ సామర్థ్యాన్ని ఎకోలొకేషన్ అంటారు. 

గబ్బిలాలు ఎకోలోకేషన్లో దిట్టలు. కేవలం శబ్ద తరంగాల ఆధారంగా అవి తమ చుట్టూ ఉన్న వాటిని గుర్తించగలవు.