మానవసహిత అంతరిక్ష యాత్రలను విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేశారు.

ఇందులో భాగంగా జంతువులను అంతరిక్షంలోకి పంపించి యాత్ర ప్రభావాలను తెలుసుకున్నారు.

మరి మనిషి కంటే ముందు అంతరిక్షయాత్ర చేసిన జంతువులు ఏవంటే..

1961లో మెర్క్యూరీ రెడ్‌స్టోన్ మిషన్‌లో భాగంగా హామ్ అనే చింపాంజీని అంతరిక్షానికి పంపించారు.

1960లో సోవియట్ యూనియన్ ప్రయోగంలో భాగంగా బెల్కా, స్ట్రెల్కా అనే శునకాలు ఈ యాత్ర పూర్తి చేశాయి

1957లో సోవియట్ యూనియన్.. స్ఫూత్నిక్-2 రాకెట్ ద్వారా లైకా అనే కుక్కను అంతరిక్షయాత్రకు పంపింది.

1959లో ఆల్బర్ట్-2 అనే కోతితో ఓ ప్రైవేటు సంస్థ యూఎస్ వీ-2 రాకెట్‌ సాయంతో అంతరిక్షయాత్ర చేయించింది.

1963లో ఫెలిసిటీ అనే పిల్లిని ఫ్రాన్స్ అంతరిక్షానికి పంపించింది. అంతరిక్షయాత్ర చేసిన ఒకే ఒక పిల్లి ఇది.

1959లో మిస్ బేకర్ అనే కోతి జూపిటర్ ఐఆర్‌బీఎమ్ అనే రాకెట్‌పై అంతరిక్ష యాత్ర చేసొచ్చింది.

1968లో సోవియట్ యూనియన్ 2 తాబేళ్లను పంపింది. అవి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టి తిరిగొచ్చాయి

2007లో టార్డీగ్రేడ్స్ అనే జీవులను అంతరిక్షంలోకి పంపించారు. అక్కడి కఠిన వాతావరణాన్ని ఇవి తట్టుకున్నాయి.