ఆకలేస్తే సొంత శరీరాన్నే తినేసే  వింత జంతువులు ఇవే..!

ఒత్తిడి లేదా గాయాలపాలైన సందర్భాల్లో మిడతలు, గొల్లభామలు వాటి శరీర భాగాలను అవే తినేస్తాయి.

ఎలుక జాతికి చెందిన హామ్‌స్టర్లు బోనుల్లో బందీలుగా ఉన్నప్పుడు వాటి తోకలు, కాళ్లను అవే తింటాయి.

ఎలుకలను బంధించిన సందర్భాల్లో అవి ఒత్తిడికిలోనై సెల్ఫ్ కెనిబాలిజంకు దిగుతాయి.

గోల్డ్ ఫిష్ లాంటి చేపలు కూడా ఒత్తిడి లేదా గాయాలపాలైనప్పుడు వాటి శరీర భాగాలను అవే తినేస్తాయి.

ఓర్బ్ వీవర్ అనే సాలీళ్లు కొన్ని సందర్భాల్లో వాటి బూజును అవే తిని కడుపునింపుకుంటాయి.

ఆక్టోపస్‌లూ సెల్ఫ్ కెనిబాలిజంకు దిగుతాయి. ఒత్తిడి, మరో జంతువు వాటిని వేటాడటం, గాయాలపాలవడం వంటి సందర్భాల్లో ఇలా చేస్తాయి.

బల్లులు కూడా ఒక్కోసారి వాటి తోకలను అవే తింటాయి.

ఎలుక జాతికి చెందిన హెడ్జ్‌హాగ్స్‌ కూడా సెల్ఫ్-కెనిబాలిజంకు దిగుతాయి. ఒత్తిడి, గాయాలు, అనారోగ్యం సమయాల్లో ఇలా చేస్తాయి.