హెయిర్ డై లు కాదు.. ఈ ప్యాక్ వేసుకుంటే తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం!
తెల్లజుట్టు కవర్ చేయడానికి రసాయనాలతో కూడిన హెయిర్ డై వేస్తుంటారు. వాటి బదులు టీ ఆకులలో రెండు పదార్థాలు కలిపి రాసుకుంటే జుట్టు నల్లగా మారడం ఖాయం.
జుట్టు సంరక్షణలో టీ ఆకులు విరివిగా వాడతారు. ఇది జుట్టును కండీషనింగ్ చేస్తుంది. జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది.
సెలెరీ కొత్తిమీరను పోలి ఉంటుంది. టీ ఆకులు, సెలెరీ రెండూ తెల్లజుట్టు నల్లగా మార్చడానికి అద్భుతంగా సహాయపడతాయి.
ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే ఉసిరికాయలు జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతాయి.
టీ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును నల్లగా మారుస్తాయి. సెలెరీలో ఉంటే సమ్మేళనాలు జుట్టు మూలాలను బలపరుస్తాయి.
టీ ఆకులను, సెలెరీని నీటిలో వేసి బాగా మరిగించాలి. దీన్ని వడగట్టి ఇందులో ఉసిరికాయ పొడి కలిపి హెయిర్ ప్యాక్ వేయాలి.
దీన్ని వారంలో రెండు సార్లు ఉపయోగిస్తుంటే తెల్లజుట్టు తొందరలోనే నల్లగా మారుతుంది.
ఇందులో ఉపయోగించిన మూడు పదార్థాలు సహజమైనవే కావడంతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.