సంక్రాంతి వచ్చిందంటే చాలు  దేశవ్యాప్తంగా వలస వెళ్లిన ప్రజలు  సొంతూళ్లకు వస్తారు

పంటలు చేతికి రావడంతో రైతులు ఆనందంగా ఈ పండగను జరుపుకుంటారు

సంక్రాంతి వేళ సాధారణంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులు నానావస్థలు పడతారు

అయితే బస్సుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 2,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది

ప్రత్యేక బస్సు సేవలు జనవరి 9 నుంచి జనవరి 13 వరకూ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది

ప్రత్యేక బస్సులు గౌలిపురలోని పాత సెంట్రల్ బస్ స్టేషన్ (CBS) నుంచి బయలుదేరుతాయని వెల్లడించింది

ప్రతి ఏటా సంక్రాంతి వేళ నడితే ప్రత్యేక బస్సులకు సాధారణంగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంటారు

ఈ ఏడాది ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది

మరోవైపు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 3 వేల ప్రత్యేక బస్సులు నడపాలని టీజీఎస్‌ఆర్టీసీ భావిస్తుంది