బియ్యంలో పురుగులు  పడుతున్నాయా..  అయితే ఈ చిట్కాలతో  వాటిని దూరం చేయండి.. 

 బే ఆకులు కీటకాలు  ఇష్టపడని సువాసన  విడుదల చేస్తాయి.

బియ్యం కంటైనర్‌లో 4  నుంచి 5 బే ఆకులు  ఉంచడం వల్ల  పురుగులను అరికట్టవచ్చు

లవంగాలు ప్రత్యేకమైన  సువాసన కలిగి ఉంటాయి.  ఇవీ పురుగులు  రాకుండా చేస్తాయి.

బియ్యాన్ని కొన్ని గంటలపాటు  ఎండలో పెట్టడం వల్ల  పురుగులు పట్టవు. 

సూర్యుడి వేడి, UV కిరణాలు  బియ్యంపై పడితే  పురుగులు చనిపోతాయి.

వెల్లుల్లి నుంచి వచ్చే  శక్తిమంతమైన వాసన  పురుగులను బియ్యం  దరి చేరనీయదు.

పుదీనా ఆకులు  ఉపయోగించడం వల్ల  బియ్యం నుంచి  కీటకాలను దూరం చేయొచ్చు.