చిన్న చిన్న పొరపాట్లు, నిర్లక్ష్యాలతో.. ఈ మందులు వాడామా ప్రమాదమే..!
ఇంటిని శుభ్రం చేయడానికి ఉత్పత్తులు లాంటివి పొరపాటున కూడా పొట్టలోకి చేరకూడదు. ఇవి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.
ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకల లాంటివి ఇంటి వాతావరణంలో స్వేచ్ఛగా తిరిగేస్తూ ఉంటాయి. వీటితో ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి.
వీటిని చంపేందుకు పొడి, పేస్ట్, పెల్లెట్స్, సిరీల్ బెయిట్స్ లేదా బ్లాక్స్ రూపంలో ఇవి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి.
పిల్లలున్న ఇళ్లలో వీటిని వాడినప్పుడు కొన్ని సందర్భాల్లో వీటి నుంచి వెలువడే విషపూరిత వాయువులు పీల్చుకోవడం వల్ల కూడా ప్రమాదాలు తలెత్తవచ్చు.
ఎరువులు, బాణాసంచా, మందుగుళ్లు, ఎలుక మందుల తయారీల్లో పసుపు లేదా తెల్లగా ఉండే ఫాస్ఫరస్‌ను ఉపయోగిస్తూ ఉంటారు.
ఈ విషపూరిత పదార్థాలు పొట్టలోకి చేరుకున్న వెంటనే వేగంగా శోషణ చెంది, కాలేయం, మూత్రపిండాలు, జీర్ణకోశం, హృదయనాళ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తాయి.
ఈ విషం బారిన పడిన 24 గంటల్లోగా వాంతులు, తలతిరుగుడు, డయేరియా, పొట్టలో నొప్పి మొదలైన లక్షణాలు తలెత్తుతాయి.
అయోమయం, సైకోసిస్, చిత్రభ్రమలు మొదలై, కోమాలోకి జారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
అయితే ఈ ఎల్లో ఫాస్ఫరస్ విషానికి ఎలాంటి విరుగుడూ లేకపోయినప్పటికీ, డీకంటామినేషన్, సపోర్టివ్ థెరపీలతో చికిత్స చేయవచ్చు.
Related Web Stories
వానలో మేకప్ చెదరకుండా ఉండాలంటే.. ఇలా చేయండి సరిపోతుంది..!
పర్పుల్ కలర్ ఆహారాలు తీసుకుంటే జరిగే మ్యాజిక్ తెలుసా?
ఉడకబెట్టినప్పుడు మరింత పోషకమైన 8 సూపర్ ఫుడ్స్ ఇవే..
వాడిన వంట నూనెను మళ్లీ ఉపయోగిస్తున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే