జుట్టూడిపోతోందా  ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

జుట్టుపై సున్నితమైన ప్రభావం చూపించే షాంపూలతో మాత్రమే తలస్నానం చేయాలి.

 జుట్టు చిక్కుపడే అవకాశం ఎక్కువగా ఉన్నవారు ముందుగా చిక్కు తీసుకుని స్నానం చేస్తే వెంట్రుకలు రాలే అవకాశం తగ్గుతుంది.

నెత్తిపై బలంగా రుద్దకుండా సున్నితంగా వేళ్లతో రుద్దుకుంటే వెంట్రుకలు రాలిపోవు. 

స్నానం తరువాత కండీషనర్ వాడితే వెంట్రుకలు చిక్కు పడకుండా ఉంటాయి. ఫలితంగా అవి రాలిపోయే అవకాశాలు తగ్గుతాయి. 

 జుట్టు దువ్వుకునేందుకు వెడల్పాంటి పళ్లున్న దువ్వెన్నలనే వాడాలి. లేకపోతే వెంట్రులపై ఒత్తిడి పెరిగి అధిక సంఖ్యలో రాలిపోతాయి.

జుట్టు ఆరబెట్టుకునేందుకు బ్లో ఎయిర్ డ్రయర్లు, జుట్టు ఉంగరాలు తిప్పే కర్లింగ్ వాండ్స్ వంటి పరికరాలకు ఎంత దూరంగా ఉంటే జుట్టు రాలడం అంత తక్కువగా ఉంటుంది.