ఫోన్‌లో ఇవి చెక్ చేస్తున్నారా.. జాగ్రత్త..

ప్రస్తుత రోజుల్లో పలువురు వాటర్ తాగకుండా ఉంటున్నారు.. కానీ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు

ఇది రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైన భాగమైపోయింది

ఏమాత్రం టైం దొరికినా ఫోన్‌లోనే అనేక మంది లీనమైపోతున్నారు

ఈ క్రమంలో అవసరమైన సమాచారంతోపాటు అవసరంలేని విషయాలు కూడా చూస్తున్నారు

ఇది క్రమంగా సమస్యలకు దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు

ఫోన్‌లో నేరాలు, హింస, బాధ కలిగించే సమాచారం చూసి పలువురు చదవకుండా ఉండలేరు

కానీ రోజు అలాగే చేస్తే క్రమంగా వ్యసనంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు

ఆ క్రమంలో అలాంటి విషాదాలు తమకు సంభవిస్తాయేమోనని ఆలోచిస్తుంటారని చెబుతున్నారు

బాధాకర వార్తలు పలువురిలో చికాకును కలిగిస్తాయని అంటున్నారు నిపుణులు 

వాటి గురించి ఆలోచించినప్పుడు కోపం, బీపీ వంటివి పెరిగిపోతాయని నిపుణులు హెచ్చరించారు

ఈ పరిస్థితి క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు నిపుణులు