షుగర్ ఉన్నవాళ్లు తినాల్సిన 5 పళ్లు ఇవి.., తినకూడని 5 పళ్లు ఇవి..

పుచ్చకాయ వద్దు.. పుచ్చకాయ అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహార పదార్థం. పుచ్చకాయ తింటే రక్తంలో చక్కెర్ స్థాయులు వెంటనే పెరుగుతాయి..

బెర్రీలు తినండి.. స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ బెర్రీలు షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పక తినాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఈ పళ్లలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

పైనాపిల్ వద్దు.. బాగా పండిన పైనాపిల్ అత్యధిక చక్కెర స్థాయులను కలిగి ఉంటుంది. ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పైనాపిల్ షుగర్ ఉన్న వారు తినకూడదు.

ఆపిల్ తినండి.. పుష్కలంగా ఫైబర్ కలిగిన ఆపిల్ పళ్లు, పీర్స్‌ను షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పక తినాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించగలవు కూడా.. 

అరటిపళ్లు వద్దు.. అరటిపళ్లకు షుగర్ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండడమే మంచిది. షుగర్ ఉన్న వారు పరగడుపున అరటిపళ్లను అస్సలు తినకూడదు. ఇది అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పదార్థం. 

జామ తినండి.. జామ కాయలు కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచివి. ఫైబర్ కంటెంట్, విటమిన్-సి ఎక్కువగా కలిగి ఉండే జామ రక్తంలో చక్కెర స్థాయులను పెరగనీయవు. 

మామిడి పళ్లు వద్దు.. పలు విటమిన్లు, ప్రోటీన్లను కలిగిన మామిడి పళ్లను కూడా ఒకేసారి ఎక్కువగా తినకూడదు. పూర్తిగా పండని పండును ఒకటి మాత్రమే తినాలి.

సిట్రస్ ఫలాలు తినండి.. విటమిన్-సిని పుష్కలంగా కలిగి ఉండే నిమ్మ జాతి ఫలాలు షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచివి. దానిమ్మ, నారింజ,  నిమ్మ వంటివి చక్కెర స్థాయులను పెరగనివ్వవు. 

ద్రాక్ష వద్దు.. ద్రాక్ష పళ్లను తినాలనుకుంటే చాలా కొద్దిగా మాత్రమే తీసుకోవాలి. ద్రాక్ష కూడా అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఫలమే. 

కివీ తినండి.. విటమిన్-సి, ఇతర పోషకాల పవర్ హౌస్ అయిన కివీ ఫ్రూట్ షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. 

ఖర్జూరం, ఎండు ద్రాక్ష వద్దు.. డ్రై ఫ్రూట్స్ అయిన ఖర్జూరం, ఎండు ద్రాక్ష రక్తంలోకి వెంటనే చక్కెరను విడుదల చేస్తాయి. వీటిని తక్షణ శక్తి అవసరమైనపుడే తినాలి.