మీకు షుగర్ ఉందా? బెల్లం గురించి ఈ విషయాలు తెలుసుకోండి..!
షుగర్ ఉన్న వాళ్లు స్వీట్లు, పంచదార మాత్రమే తినకూడదని అనుకుంటారు. బెల్లం విషయంలో కాస్త ఉదాసీనంగా ఉంటారు. అయితే బెల్లంలో కూడా కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.
మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తి శరీరంలో ఇన్సులిన్ చాలా తక్కువగా విడుదలవుతుంది లేదా అసలు పూర్తిగా విడుదల కాదు.
పంచదారలో ఎంత షుగర్ కంటెంట్ ఉంటుందో, బెల్లంలో కూడా అదే స్థాయిలో షుగర్ కంటెంట్ ఉంటుంది.
పంచదారకు బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగదని చాలా మంది నమ్ముతారు. అయితే బెల్లం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలిగిస్తుంది.
బెల్లాన్ని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతాయి.
కొందరు పెరుగన్నం తినే సమయంలో బెల్లం తింటుంటారు. అలా తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే ట్రై గ్లిజరాయిడ్స్ కోసం పెరిగిపోతాయి.
కొందరు ప్రత్యేకంగా బెల్లంతో చేసిన స్వీట్స్ తింటారు. షుగర్ స్వీట్స్ ఎంత ప్రమాదకరమో బెల్లంతో చేసినవి కూడా మధుమేహులకు అంతే ప్రమాదకరం.
కొందరు ప్రత్యేకంగా బెల్లంతో చేసిన స్వీట్స్ తింటారు. షుగర్ స్వీట్స్ ఎంత ప్రమాదకరమో బెల్లంతో చేసినవి కూడా మధుమేహులకు అంతే ప్రమాదకరం.