షుగర్ వ్యాధిగ్రస్తులూ..
వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..
షుగర్ వ్యాధిగ్రస్తులు వేసవిలో నీరు ఎక్కువగా తాగాలి. డీ-హైడ్రేషన్ కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగిపోతాయి.
ఉదయం పూట ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఫలితంగా రక్తంలోకి గ్లూకోజ్ చాలా నెమ్మదిగా విడుదలవుతుంది.
వేసవిలో పెరుగు, యోగర్ట్ తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. ఇవి ఆకలిని నియంత్రించడమే కాకుండా రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోకుండా చూస్తాయి.
పుచ్చకాయ, బొప్పాయి, సిట్రస్ ఫలాలను ఎక్కువ తీసుకోవడం ద్వారా చెమట రూపంలో కోల్పోయిన నీటిని తిరిగి పొందే వీలుంటుంది.
మజ్జిగ వీలైనంతగా తాగితే మీ శరరీం కూల్ అవుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది.
కాఫీ, టీ, ఆల్కహాల్‌ను వీలైనంత వరకు తగ్గించండి. ఇవి మీ శరీరాన్ని డీ హైడ్రేషన్‌కు గురి చేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచుతాయి.
ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేయండి. తగినంత శారీరక శ్రమ చేయండి. ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్‌ల జోలికి వెళ్లకండి.
వేసవిలో దొరికే ఫలాలతో సలాడ్స్ చేసుకుని తినండి. ఇవి మీకు కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తాయి. త్వరగా ఆకలి వేయదు.
వారానికి ఒకసారి తప్పకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. మందులు, మాత్రలు క్రమం తప్పకుండా వాడండి.
Related Web Stories
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? ఈ విషయాలను మరవద్దు!
ఒడిశాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలివే..
100 ఏళ్ల తర్వాత హోలీ రోజున చంద్ర గ్రహణం..వీరికి అలర్ట్