మూడు పూటలు అన్నమే  తింటున్నారా.

ప్రతిరోజూ అన్నం తినడం మంచిదే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇటీవలి అధ్యయనాల ప్రకారం, ఎక్కువగా అన్నం తినడం వల్ల కొంతమందిలో వివిధ దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి..

అన్నం ఎక్కువగా తింటే శరీరంలో కార్బోహైడ్రేట్స్ విపరీతంగా పెరుగుతాయి. 

రోజుకు మూడుసార్లు తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. 

 అనేక రకాల పొట్ట సమస్యలతో బాధపడేవారు అన్నం ఎక్కువగా తినకుండా ఉండాలి.

 అన్నం ఎక్కువగా తింటే గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

కాలేయం దెబ్బతినడంతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.