మీరు షుగర్ ఎక్కువ తింటున్నారా?  ఈ లక్షణాలు మీకు ఉన్నాయా..?

పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో తరచుగా ఎనర్జీ లెవెల్స్ పడిపోతున్నట్టు, నీరసం ఆవహిస్తున్నట్టు అనిపిస్తుంది. దానికి కారణం రక్తంలో చక్కెర స్థాయిలో మార్పులు రావడం. 

భోజనం చేసిన తర్వాత స్వీట్లు తినాలనిపిస్తుంటే.. మీ శరీరం హెచ్చు స్థాయి చక్కెర వినియోగంపై ఆధారపడుతున్నట్టు అర్థం. 

పంచదార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఫలితంగా మీ పొట్ట భాగం పెరుగుతుంటుంది. 

స్వీట్లు ఎక్కువగా తినడం మీ మూడ్‌పై ప్రభావం చూపుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో మార్పులు డిప్రెషన్, ఆందోళన, మూడ్ స్వింగ్స్‌కు కారణమవుతాయి. 

ఆక్నే, శరీరంపై ముడుతలు మొదలైన చర్మ సమస్యలు వస్తాయి. స్వీట్ల వల్ల ఇన్సులిన్ ఎక్కువ విడుదల కావడమే దీనికి కారణం. 

శరీరంలో చక్కెర స్థాయులు పెరిగితే దేని మీదనైనా శ్రద్ధ పెట్టడం కష్టమవుతుంది. మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. 

తరచుగా దంత సమస్యలు, గమ్ ప్రాబ్లమ్స్ వస్తున్నా మీరు చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారని అర్థం. 

హెచ్చు స్థాయి పంచదార తీసుకోవడం వల్ల గట్ మైక్రోబియమ్ దెబ్బ తింటుంది. ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు మొదలై జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం పాడవుతుంది.