వాడిన వంట నూనెను మళ్లీ ఉపయోగిస్తున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

ఒకసారి వేడిచేసిన వెజిటేబుల్ వంట నూనెను మళ్లీ వేడి చేసి వాడుతున్నారా అయితే జాగ్రత్త

అలా చేస్తే వివిధ రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్న ఐసీఎంఆర్ వైద్యులు

రీహీట్ చేయడంతో ఆల్డిహైడ్ కార్సినోజెనిక్‌గా మారి క్యాన్సర్‌కు దారితీస్తుందని వెల్లడి

నూనెలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి హార్ట్ స్ట్రోక్ వ్యాధులు తలెత్తుతాయని ప్రకటన

వీటితో పాటు నాడీ సంబంధ అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధులు కూడా పెరుగుతాయని స్పష్టం

అంతేకాదు గొంతు, కుడుపులో మంట ఏర్పడి ఎసిడిటీకి దారితీస్తుందని హెచ్చరిక 

ఈ క్రమంలో ఒకసారి ఫ్రై చేసిన నూనెను మళ్లీ వేయించడానికి వాడొద్దని సూచన

దానిని కేవలం కూరలు వండుకోవడానికి మాత్రమే ఉపయోగించాలని  నిపుణుల వెల్లడి

ఒకట్రెండు రోజులకు మించి ఎక్కువ రోజులు ఈ నూనెను స్టోర్ చేయోద్దని వెల్లడి

వంట నూనె కొనుగోలు చేసే సమయంలో పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నవి ఎంచుకోవాలని సూచన