నోటి దుర్వాసన వేధిస్తోందా?.. ఇలా చేయండి..

దాల్చిన చెక్కలో యాంటీ-మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉండే నూనెలు ఉంటాయి. ఇవి నోటిలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.

గ్రీన్ టీలో ఫాలీపినోల్స్, శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటిలోని చెడు బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తాయి.

యాలకులను నోట్లో వేసుకున్నా, యాలకుల నీటితో నోరు పుక్కిలించినా చాలా ఉపయోగముంటుంది. నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను యాలకులు నాశనం చేస్తాయి.

అల్లం యాంటీ-మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లం ముక్కను నమిలినా, అల్లం టీ తాగినా నోటి దుర్వాసన తగ్గి తాజాగా అనిపిస్తుంది.

పుదీనా ఆకులను నమిలినా, పుదీనా టీ తాగినా నోటి దుర్వాసన పోయి తాజాదనం వస్తుంది.

నిమ్మ రసం నోటిలో లాలాజలం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే ఎసిడిక్ స్వభావం కలిగి ఉండే నిమ్మ నోటి దుర్వాసనకు అడ్డుకట్ట వేస్తుంది

నోటి దుర్వాసనకు ఆపిల్స్ కూడా చెక్ పెడతాయి. ఆపిల్స్‌లోని ఎంజైములు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను న్యూట్రలైజ్ చేస్తాయి.

యోగర్ట్‌లో ప్రో-బయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. నోటి దర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో యోగర్ట్‌లోని ప్రో-బయోటిక్స్ సహాయపడతాయి.

కొత్తిమీర జాతికి చెందిన పార్స్ లీ ఆకుల్లో క్లోరోఫైల్ అనే రసాయనం ఉంటుంది. సహజ డియోడరైజర్‌లా పని చేసే పార్స్ లీ ఆకు నోటి దుర్వాసనకు అడ్డుకట్ట వేస్తుంది.