అతిగా ఆలోచించి టెన్షన్ పడుతున్నారా? ఈ జపనీస్ టెక్నిక్స్ ఫాలోకండి.. 

అతిగా ఆలోచించి విపరీతంగా టెన్షన్ పడే వారు ఈ ఏడు జపనీస్ టెక్నిక్స్‌ను పాటిస్తే చాలా ఉపశమనం పొందుతారు. ప్రశాంతంగా జీవించడం నేర్చుకుంటారు. 

ఇకిగై.. మీకు అత్యంత ఇష్టమైన పనేంటో గుర్తించండి. మీ మనసుకు నచ్చే పని, సంతృప్తి కలిగించే పని కోసం సమయం కేటాయిస్తే ప్రతికూల ఆలోచనల నుంచి మీ మనసు బయటకు వస్తుంది.

వాబీ-సాబి.. అసంపూర్ణంగా ఉండడాన్ని, ఓటములను స్వీకరించండి. చాలా విషయాలు పరిపూర్ణంగా ఉండవని గ్రహించడం వల్ల అతిగా ఆలోచించే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 

షిన్రిన్-యోకు.. ప్రకృతికి దగ్గరగా సహజ వాతావరణంలో సమయం గడపడం ఒత్తిడిని తగ్గిస్తుంది. బుద్ధిని సరైన దారిలో పెడుతుంది. 

జాజెన్.. నిశబ్దంగా కూర్చుని మీ శ్వాసపై దృష్టి పెట్టి మైండ్‌ఫుల్ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయండి. మీ ఆలోచనల మీద నియంత్రణ సాధించండి. 

కింట్సుగి.. మీలోని లోపాలను, మీరు ఎదుర్కొన్న ఓటములను కూడా ప్రేమించండి. అసంపూర్ణంగా ఉండడంలో కూడా అందం ఉందని గ్రహించండి. 

కైజెన్.. పెద్ద లక్ష్యాలు కాకుండా, చిన్న చిన్న లక్ష్యాలు, వాటిని సాధించడంపై దృష్టి సారించండి. అప్పుడు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

జిన్బా ఇట్టై.. మీ పరిసరాలతో, చుట్టూ ఉన్న వారితో ఐక్యత సాధించండి. సజ్జన సాంగత్యం వల్ల ప్రతికూల ఆలోచనలు మీకు దరిచేరవు.