అంట్లు తోమడానికి స్పాంజ్,
స్క్రబ్బర్లు వాడుతున్నారా..
స్క్రబ్బర్లు, స్పాంజీలు వాడడం
వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే
అవకాశాలు ఉంటాయి.
ఇందులో పెరిగే ఈ-కొలి
అనే బ్యాక్టీరియా కారణంగా
కిడ్నీ సంబంధిత వ్యాధులు
వచ్చే అవకాశముంటుంది.
స్టెఫిలోకాకస్ అనే బ్యాక్టీరియా
కారణంగా.. చర్మ సంబంధిత
వ్యాధులు, వాంతులు, విరేచనాలు
అయ్యే అవకాశం ఉంటుంది.
అంట్లు తోమిన తరువాత
వాటిలో ఉండే తేమ..
సూక్ష్మజీవుల పెరుగుదలకు
అనువైన వాతావరణాన్ని
కలిగిస్తుంది.
ఈ వ్యాధుల నుంచి బయట
పడాలంటే స్క్రబ్బర్లు, స్పాంజీల
వాడకాన్ని తగ్గించాలని
ఆరోగ్య నిపుణులు
సూచిస్తున్నారు.
వాటి స్థానంలో సెల్యులోజ్
ఆధారిత స్క్రబ్బులు, సింగిల్
యూజ్ మెటల్ స్క్రబ్బీలు,
డిష్‌వాషర్లు వినియోగించొచ్చని
చెబుతున్నారు.
ప్లాస్టిక్ స్క్రబ్బులు,
స్పాంజీలు పర్యావరణానికి
హానికరం కాబట్టి,
వాటిని వినియోగించకపోవడమే
ఉత్తమం.
Related Web Stories
ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? మీకు తెలియని నిజాలివీ..!
దసరా రోజు చేయకూడని పనులు
విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
డయాబెటిస్, కొలస్ట్రాల్ మధ్య సంబంధమేంటి.. ఈ నిజాలు తెలిస్తే..