వాటర్ హీటర్ ఉపయోగిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వాటర్ హీటర్‌ను ప్లాస్టిక్‌ బకెట్‌లో పెడితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

నేరుగా బకెట్‌కు హీటర్‌ హుక్‌ను తగిలించకూడదు, ఇలా చేస్తే వేడికి ప్లాస్టిక్‌ కరిగిపోతుంది

బకెట్‌కు మధ్యలో ఒక స్టిక్ ఉంచి దానికి మధ్యలో వాటర్‌ హీటర్‌ను వేలాడదీయాలి

వీలైనంత వరకు అల్యూమినియం బకెట్‌లను ఉపయోగించడం మంచిది

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాటర్ హీటర్‌ను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు

పిల్లలు తిరగని చోట ఇంట్లో ఏదో ఒక మూలకు హీటర్ ఏర్పాటు చేసుకోవాలి

కొందరు వాటర్‌ హీటర్‌లను గంటల కొద్దీ ఆన్‌లోనే ఉంచుతుంటారు

నీళ్లు వేడెక్కడం కాదు కొన్ని సందర్భాల్లో షార్ట్‌ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది

వాటర్‌ హీటర్‌లను బాత్‌రూమ్‌లలో ఏర్పాటు చేసుకోవద్దు

బాత్‌రూమ్‌లో ఉండే తడి కారణంగా కొన్ని సందర్భాల్లో షాక్‌ వచ్చే ఛాన్స్ ఎక్కువ

హీటర్‌ రాడ్ నీటిలో మునిగేలా చూసుకోవాలి. లేదంటే త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంది

స్విఛ్‌ ఆఫ్‌ చేసి నీటిలో చేయి పెట్టి వేడిని టెస్ట్ చేయోద్దు, బోర్డ్‌ నుంచి ప్లగ్‌ తీసి పరీక్షించాలి