రెండో రోజు అటుకుల
బతుకమ్మ.. విశిష్టత ఇదే
ఎంగిలిపూల బతుకమ్మతో
పండుగ వేడుకలు
షురూ అయ్యాయి
తొమ్మిది రోజుల పాటు
బతుకమ్మ వేడుకలను
జరుపుకుంటారు తెలంగాణ
ఆడపడుచులు
నిన్న ఎంగిలిపూల
బతుకమ్మను తయారు
చేసి ఆడి పాడిన మహిళలు
రెండో రోజు అటుకుల
బతుకమ్మను తయారు చేస్తారు
ఆశ్వయుజ శుద్ధ
పాడ్యమి నాడు అటుకులు
బతుకమ్మను జరుపుకుంటారు
ముఖ్యంగా ఈ బతుకమ్మను
చిన్నపిల్లలు చేస్తుంటారు
అటుకులు నైవేద్యంగా ఇవ్వడం
వల్లే ఈ పండుగకు అటుకుల
బతుకమ్మ అనే పేరువచ్చిందని
చెబుతుంటారు మన పెద్దలు
బతుకమ్మ పండుగ రెండో
రోజు అవడంతో రెండు
వరుసలతో బతుకమ్మను
పేరుస్తారు మహిళలు
ఉదయాన్నే లేచి తలంటు
స్నానం ఆచరించి... ఇళ్లును
శుభ్రం చేసిన తరువాత బతుకమ్మ
కోసం తెచ్చిన పూలతో
అటుకుల బతుకమ్మను పేరుస్తారు
ఈ బతుకమ్మ తయారీలో
తంగేడు, గునుగు పూలు చాలా ముఖ్యమైనవి.ఈ పూవులను
తప్పని సరిగా ఉండేటట్లు
చేసుకుంటారు మహిళలు
ఈరోజు బతుకమ్మ వేడుకల్లో
పెద్దలకంటే పిల్లలే సందడిగా
జరుపుకుంటారు
బతుకమ్మ చుట్టూ చిన్నారులు
ఆడి పాడిన తర్వాత వారికి
ఎంతో ఇష్టమైన బెల్లం,
అటుకులను
పంచిపెడతారు పెద్దలు
వాటిని ఎంతో ఇష్టంగా
తింటారు చిన్న పిల్లలు.
అనంతరం మహిళలు
వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు
Related Web Stories
మ్యూజిక్‌తో మొక్కల్లో మ్యాజిక్..
తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ
దుస్తులపై మరకలు పోవాలంటే ఈ ట్రిక్స్ ప్రయత్నించండి.. !
పండుగల సమయంలో ఖర్చును తగ్గించే చిట్కాలు