ఈ 7 ఆహారాలు మైక్రోవేవ్ ఓవెన్ లో వేడి చేయకూడదు.

చాలామంది తెలియక అన్ని ఆహారాలను మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టి వేడి చేస్తుంటారు. కానీ ఈ 7 ఆహారాలు  వేడి చేస్తే ప్రమాదం.

కారం మిరపకాయలు ఓవెన్  లో పెట్టినప్పుడు వాటిలో  క్యాప్సైసిన్  గాలిలో విడుదల అవుతుంది. ఇది ఘాటైన వాసనతో ఓపెన్ ను పాడుచేస్తుంది.

హాట్ పెప్పర్స్

గుడ్లు

గుడ్లను ఓవెన్ లో పెడితే ఆవిరి ఏర్పడుతుంది. దీనివల్ల పేలుడు సంభవించే ప్రమాదం ఉంటుంది.

ప్రాసెస్ మాంసం

ప్రాసెస్ చేసిన మాంసం అధిక ఉష్ణోగ్రతకు గురైతే  హానికరమైన రసాయనాలు విడుదల అవుతాయి. దీన్ని తింటే ప్రమాదం.

బ్రెస్ట్ మిల్క్

తల్లిపాలను సేకరించి తరువాత  పిల్లలకు ఇచ్చే అలవాటు  ఉంటుంది. కానీ ఈ పాలను ఓవెన్ లో వేడి చేయకూడదు. పిల్లల నోరు, గొంతు దారుణంగా దెబ్బతింటాయి.

ఆకుకూరలు

పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు ఓవెన్ లో వేడి చేస్తే అవి చాలా మెత్తగా అయిపోతాయి. అసహ్యంగా అనిపిస్తాయి.

పాస్తా సాస్

సాస్ లు చిక్కగా ఉంటాయి. వీటిని ఓవెన్ లో వేడిచేస్తే ఆవిరికి గురై పేలుడు సంభవించే ప్రమాదం ఉంటుంది.

బ్రోకలి

బ్రోకలిని ఓవెన్ లో వేడి చేస్తే వాటిలోని పోషక విలువలు తగ్గిపోతాయి.