పీసీఓఎస్‌తో బాధపడుతున్నారా?  వీటిని అస్సలు తినకండి.. 

పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది మహిళల్లో కనిపించే హార్మోనల్ డిజార్డర్. ఈ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. 

వైట్ బ్రెడ్, పేస్ట్రీలు, పంచదార ఎక్కువ వేసి చేస్తే స్వీట్లు, కేక్‌లు వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్‌కు దూరంగా ఉండాలి. 

క్యాండీలు, జ్యూస్‌లు, కూల్‌డ్రింక్‌లు కూడా పీసీఓఎస్ సమస్యను మరింత పెంచుతాయి. 

ప్యాకేజ్డ్ ఫుడ్స్, షాప్‌‌ల్లో ఫ్రిజ్‌ల్లో ఉంచే పదార్థాలు, ఎక్కువ సోడియం ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. 

అరటి పళ్లు, మామిడి పళ్లు, ద్రాక్ష వంటి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ కూడా తీసుకోకూడదు. 

కొవ్వు శాతం ఎక్కువగా ఉండే పాలు, వెన్న, యోగర్ట్, ఇతర డైరీ పదార్థాల జోలికి వెళ్లకూడదు. 

నూనెలో వేయించిన పదార్థాలు కూడా పీసీఓఎస్ సమస్యను మరింత పెంచుతాయి. పదార్థాల జోలికి వెళ్లకూడదు. 

ప్రాసెస్ చేసిన మాంసాలు, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోకూడదు

పీసీఓఎస్ సమస్యను ఆల్కహాల్ చాలా విపరీతంగా పెంచుతుంది.