జాగ్రత్త.. వేసవి కాలంలో  ఈ కూరగాయలను తినకండి.. 

వేసవి కాలంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలకు దూరంగా ఉండాలి. ఇవి శరీరంలో మరింత వేడిని ఉత్పత్తి చేస్తాయి. 

బచ్చలి కూర, కాలే వంటివి హెచ్చు స్థాయిలో ఆక్సాలిక్ యాసిడ్‌ను కలిగి ఉంటాయి. వేసవిలో ఇవి శరీరానికి మరింత వేడి అందిస్తాయి.

క్యాబేజ్‌లో మంచి పోషక విలువలుంటాయి. కానీ, వేసవిలో తినకపోవడమే మంచిది. క్యాబేజ్ వల్ల వేడి చేసి విరేచనాలు మొదలవుతాయి. 

వేసవిలో పుట్టగొడుగులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవి కూడా వేడి కలిగించే ఆహార పదార్థాలే. 

పచ్చి మిరపకాయలను వేసవిలో వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. 

కేరెట్, బీట్‌రూట్ వంటి వేరు ఉత్పత్తులు కూడా వేడి కలుగచేస్తాయి. వీటిని సాధ్యమైనంత తక్కువగా ఉపయోగించాలి. 

కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలు, కూల్‌డ్రింక్స్‌ను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. వేసవిలో ఇవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.

సాయంత్రం సమయంలో చాలా మంది నూడిల్స్, ఫ్రైడ్ రైస్ వంటి ఫాస్ట్‌పుడ్ తీసుకుంటుంటారు. వేసవిలో ఇవి చాలా హాని కలిగిస్తాయి.