శీతాకాలం సమస్యలకు  ఆయుర్వేద చిట్కాలు..

దగ్గు, జలుబు: నీళ్లలో జింజర్‌ రూట్‌ నానబెట్టి తాగాలి. ఆహారంలో అల్లం ఎక్కువగా వాడాలి. గొంతు నొప్పి, దగ్గు, జలుబు తగ్గడం కోసం పాలలో పసుపు కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగాలి.

 కాళ్లవాపు: గ్లాసు నీళ్లలో ధనియాలు కలిపి నీళ్లు సగం అయ్యేవరకూ మరిగించాలి. ఇలా వాపు తగ్గేవరకూ ఆ నీళ్లను ప్రతిరోజూ తాగుతూ ఉండాలి. 

పాదాల పగుళ్లు: అరటిపండు గుజ్జును పగుళ్లకు పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

పొడి జుట్టు: గుడ్డు పచ్చసొన, ఆలివ్‌ ఆయిల్‌ కలిపి వెంట్రుకలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి.

పొడిచర్మం: పెరుగు, మజ్జిగ కలిపి చర్మానికి పూసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.