జుట్టుకు రంగు వేస్తున్నారా జాగ్రత్త.. ఇలా చేయకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్!

ప్రస్తుతం వివిధ కారణాలతో అనేక మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వేధిస్తోంది

జుట్టు నల్లగా కనిపించడం కోసం అనేక మంది జుట్టుకు కలర్స్ వాడుతున్నారు

కానీ తరచూ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

హెయిర్ కలర్స్ ఎక్కువగా వాడడం వల్ల జుట్టు క్యూటికల్స్ దెబ్బతింటాయట

దీని వల్ల జుట్టు పెలుసుగా మారి తెగిపోతుందని అంటున్నారు

హెయిర్ కలర్స్‌లో కెమికల్స్ కొంత మందికి పడకపోవచ్చు

దీంతో వారికి రంగు వల్ల చికాకు, దురద, చర్మం ఎరుపు, వాపు, అలర్జీల వంటి లక్షణాలు కనిపిస్తాయి

హెయిర్ కలర్స్‌లో అమ్మోనియాతో పాటు అనేక కెమికల్స్ ఉంటాయి

దీనివల్ల కొందరిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు

వీటిని వాడే ముందు చేతిమీద రంగు కొంచెం రాసుకుని 15 నిమిషాలు చూడాలి

తర్వాత ఎలాంటి ఎఫెక్ట్ చూపకపోతే వెంట్రుకులకు వేసుకోవాలని చెబుతున్నారు